Tuesday, April 29, 2008

సహాయం

మనం ఎవరికైనా ఏ విధమయిన సహాయం చెయ్యాలంటే ఎంతో ఆలోచిస్తాం, మనకు తిరిగి వారివల్ల ఉపయోగం ఉంటుందోలేదోనని బేరీజు వేసుకుంటాము, అయినా సంశయిస్తాము. వారు అభ్యర్దిస్తేనే గాని సహాయం చెయ్యడానికి ముందుకురాము. అలా అయితే మనం చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నట్టే లెక్క. 
ప్రత్యుపకారానికి సంభందించిన విషయాలను ధృష్టిలో పెట్టుకోకుండా, మనస్పూర్తిగా, మీ పరిధిలో, మీకు చేతనయిన సహాయం చెయ్యండి.

అనుభవపూర్వకంగా ఒక విషయం చెప్తున్నాను …

మీ కష్టకాలంలో/ అవసరంలో ఉన్నప్పుడు, మీరు ఊహించని విధంగా, మీకు సహాయం చెయ్యడానికి చాలా మంది ముందుకు వస్తారు.

ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది.

Posted by nani at 13:23:24 | Permalink | No Comments »

Monday, April 28, 2008

ఆనందం

ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం, అది బయట దొరికే వస్తువు కాదు, అది మనలోనే దాగి ఉంటుంది, దానిని వెతికి వెలికి తీయవలసి ఉంటుంది. అది డబ్బుతో కొనగలిగేది కాదు. డబ్బుతో కొనగలమని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే, అది కూడా తాత్కాలికమే.

మన వద్ద ఎదో లేదని, ఎదో కొల్పోయామని భావించకుండా, ఉన్నదానితో సంతృప్తిగా ఉండగలిస్తే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. కొంత ప్రయత్నం, కొంత కృషి ద్వారా ఆనందంగా ఉండడం అలవాటవుతుంది. ప్రతి సంధర్భాన్ని మనసారా అనుభవించి ఆస్వాధించగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది.  

ఎవరో మహా కవి చెప్పినట్టు ఆనందం సీతాకోకచిలుక లాంటిది, దానిని పట్టుకోవాలని వెంటపడితే అది అందకుండాపోతుంది, అలా కాకుండా ఒక దగ్గర స్థిరంగా స్థిమితంగా ప్రశాంతంగా కూర్చుంటే ఆనందం అనే సీతాకోకచిలుక మన భుజం మీద వాలుతుంది.

మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి, మీకేం కావాలో తెలుసుకోండి, ఆశావహ ధృక్పధం అలవాటు చేసుకుంటే, సగం ఆనందం మీ వెంటే.

Posted by nani at 11:08:25 | Permalink | No Comments »

Thursday, April 24, 2008

అందరూ మంచివారే

అందరూ మంచివారే వారి వారి స్థానాల్లొ, ఎటొచ్చీ ఇంకొకరి విషయాల్లొ తలదూర్చి కంగాళీ చెయ్యకుండ ఉండినంతవరకు. పైగా అసలు చిక్కంతా ఎక్కడ వస్తుందంటే, ఎవరు ఏ పని చెయ్యాలో అది తప్ప అన్ని పనులు చేస్తారు, అదో ఆనందం. ఎదుటి వారిని సంత్రుప్తి పరచటంలోనే అంతా ఊందనుకుంటారు, తను చెసే పనిలో తనకు ఆనందం దక్కాలని అనుకోరు. 
Posted by nani at 14:20:34 | Permalink | Comments (1) »

Sunday, April 20, 2008

నమ్మకం

ఏ పని చెయ్యాలన్నా ముందు మనమీద మనకు నమ్మకం ఉండాలి, ఆ తరువాతే మిగతా విషయాలు పరిగణలోకి వస్తాయి.మన మీద మనకు నమ్మకం ఏర్పడాలంటే కొంత సాధన అవసరం, అది చిన్న చిన్న విజయల ద్వారా సాధ్యం అవుతుంది. ఆ విజయాలను మనసారా ఆస్వాదించాలి. అప్పుడు మెల్లమెల్లగా మనం కూడా ఏ పనైనా చెయ్యగలమనే నమ్మకం ఏర్పడుతుంది. 
Posted by nani at 07:37:37 | Permalink | No Comments »

Wednesday, April 16, 2008

పని చేయు విధానం

ఏ సందర్భాన్నైనా/ ఏ సంగతైనా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించగలగాలి, అప్పుడే సరియైన అవగాహన ఏర్పడుతుంది, దోలాయమాన పరిస్థితినుండి బయటపడగలుగుతాము. తదుపరి చెయ్యవలసిన విషయం గ్రహింపునకు వస్తుంది. చేసే పని చిన్నదైనా/ పెద్దదైనా మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా లీనమై చెయ్యాలి, అప్పుడే అది విజయవంతమౌతుంది, అలాగే ఎందరికో స్పూర్తినిస్తుంది.
Posted by nani at 14:28:07 | Permalink | Comments (1) »

Wednesday, April 2, 2008

ప్రస్తుతంలో జీవించండి

గతం మన చేతిలో లేదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, అందుకని ప్రస్తుతాన్ని జాగరూకతతో గమనించాలి, సద్వినియోగం చేసుకోవాలి.
Posted by nani at 10:31:20 | Permalink | No Comments »