Monday, May 19, 2008

కృతజ్ఞత

మనకు ఎవరైనా చిన్నదైనా/ పెద్దదైనా లేక ఏరకమైన సహాయం చేసినట్లయితే మనం దానికి ప్రతిగా వెంటనే ధన్యవాదములు తెలియజేస్తాం, భావప్రకటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం, ఎందుకంటే అన్నిటికంటే అదే సులువైనది కదా!

అంతేకాని, మనకు సహాయం చేసినవారికి ప్రత్యుపకారంగా ఏవిధమైన సహాయం చెయ్యవలసివచ్చినప్పుడు/ మనం చెయ్యగలసిదైనప్పటికి కూడా మనం తప్పించుకోజూస్తాం లేదా మొహం చాటేస్తాం. 
నా అభిప్రాయం ప్రకారం కృతజ్ఞతాభవం మాటల్లోకాకుండా చేతల్లోచేసిచూపిస్తేనే దానికి సార్ధకత.
అలాగే అభిమానం, గౌరవం మొదలైనటువంటివి కూడా మాటల్లోనే వ్యక్తపరచడానికే ప్రాధాన్యం ఇస్తుంటారు, దానివల్ల వాటియొక్క ఔన్నత్యం తేలిపోతొంది, అలాకాకుండా కృతజ్ఞత, అభిమానం మరియు గౌరవం లాంటివాటిని మాటల్లో కాక చేతల్లో చేసి చూపించాలి.

Posted by nani at 08:56:59 | Permalink | No Comments »

Saturday, May 17, 2008

ద్వందనీతి

నీతిని, న్యాయాన్ని మనకైతే ఒకలాగ, ఇతరులకైతే వేరొకలాగ అన్వయించడమే ద్వందనీతి … ఇదే ఇప్పుడు అనేక అక్రమాలకు, ఆక్రుత్యాలకు, అన్యాయాలకు కారణభూతమవుతున్నది.
అంతెందుకు మనం చెప్పెది చెయ్యం, చేసేది చెప్పం. ఎందుకంటే మనం చెప్పే విషయాలమీద మనకే నమ్మకం లేకపోవడం కావచ్చు లేదా అవి మనం ఎలాగూచెయ్యమన్న ఆలోచనకావచ్చు.

హక్కులు, సదుపాయాలు, అధికారాలు అన్నీమనకే దక్కాలి, భాధ్యత వహించడానికి మాత్రం వెనకాడతాం లేక తప్పించుకోజూస్తాం, వీలైతే ప్రక్కవాడిమీదకు తోసెయ్యడానికి ప్రయత్నిస్తాం.
ఒకటి మాత్రం స్పష్టం, మనం చెయ్యల్సిన పనులు, నిర్వర్తించాల్సిన విధులు ఎంత కాలయాపన చేసినప్పటికి, తప్పించుకోజూసినప్పటికీ వాటిని మనం మాత్రమే చెయ్యాల్సి ఉంటుంది, భాధ్యత కూడా వహించాల్సి ఉంటుంది.
 

Posted by nani at 05:59:45 | Permalink | No Comments »

Sunday, May 4, 2008

హాయిగా నవ్వండి మనసారా

గిరిగీసుకుని/ గడి కట్టుకుని, తమని తాము బంధించుకుని బతికేస్తుంటారు చాలా మంది. ప్రపంచభారాన్నంతా తామే మొస్తున్నంతగా కృంగిపోతారు,  గానుగకు కట్టిన ఎద్దు మాదిరి తమ చుట్టూ తాము తిరుగుతారు. ఎవరితోనైనా మాట్లాడితేఎమైపోతుందోనని, ఏం చెయ్యాల్సివస్తుందోనని భయమేమో.
జరిగినంత కాలం బాగానే ఉంటుంది, కాని సంఘం నుంచి, సమాజం నుంచి మనని మనం ఎంత కాలం దూరం చేసుకుంటాం, చివరకు గాని తెలియదు మనమేం   కోల్పోయామో.
జీవితాంతం మన విషయాలు ఎవరికీ తెలియకూడదని గుంభనగా, లౌక్యంగా ఉండాలనే తాపత్రయంలో, గుప్పెట బిగించి, గుండె తలుపులు మూసి, బావిలో కప్పలా తయారవుతాము.

అంతా మారాలనుకుంటాము, కేవలం మనం తప్ప.

గది తలుపులు, కిటికీలు మూసి ఉంచేస్తే, ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించక ఎలా గబ్బు కంపు కొడుతుందో, అలాగే మనం కూడా తయారవుతాం. వచ్చినప్పుడు ఏమి తెచ్చుకున్నాం, పోయేటప్పుడు ఏమి తీసుకుపోతాం, మధ్యలో ఎందుకంత అభధ్రతా భావం.

ఆఖరికి మనసారా నవ్వడానికి కూడా సంశయమే. ఆనందంగా ఉన్నామని ఎదుటివాడికి తెలిస్తే ఏదో అయిపోతుందన్నంతగా కుచించుకుపోయాము.

అనేక మానసిక/ శారీరక రుగ్మతలకు మూలం ఇదే.

అందరితో కలవండి, భావ సారూప్యత కలిగినవారితో మనసువిప్పి భావాలను పంచుకోండి. తరువాత కలిగిన మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు.

హాయిగా నవ్వండి మనసారా ………

నవ్వుల దినోత్సవం సంధర్బంగా … అభినందనలతో … శర్మ

Posted by nani at 08:03:06 | Permalink | No Comments »