Sunday, June 29, 2008

ప్రాపకం

మనం ఎందుకో, ఎదుటివారి కనుసన్నల్లో మెలగాలని, వారిని ప్రసన్నం చేసుకోవాలని, ప్రసన్నతకలిగే పనులే చేయాలని, అలా చేయడంలోనే మన మనుగడ ఉంటుందని, పైవారి ఆశీస్సుల కోసం ప్రాకులాడతాము, ప్రాపకం కోసం అర్రులు చాస్తాం, అది కేవలం తాత్కాలికమని తెలిసినా కూడా …
ఇదొక పెద్ద ఊబి లాంటిది, అన్ని రకాలయిన మత్తు పదార్దాలకు అతీతమయినది, దీనికి అలవాటు పడితే, అందులోంచి బయటకు రాలేనంత మాయా ప్రపంచం.
ప్రాపకం అనేది ఎంత దారుణమయినదంటే, అందులో ఇరుక్కుంటే, ఆఖరికి మన అస్థిత్వాన్ని కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడినా కూడా, అటువంటి సంధర్భాల్లో కూడా బయటకు రాలేకపోతాము, అభద్రతా భావానికి లోనవుతాము.
సాధారణంగా మనకి మనమీద కంటే ఎదుటివారిమీద నమ్మకం ఎక్కవ.
అందుకే ఇటువంటి పరిస్థితులనుండి మనల్ని మనం కాపాడుకోఅవాలి.
సకారాత్మకమయిన ఆలోచనా ధ్రుక్పధాన్ని అలవరుచుకుని, మన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, నిత్యనూతనంగా ఉండడం ద్వారా, మనమీద మనకు నమ్మకం ఏర్పడుతుంది, తద్వారా విజయం సాధించడానికి  కావలసిన పునాదులు ఏర్పడతాయి. అప్పుడు ప్రపంచం అంతా మీ వెంటే…
అన్నింటికంటే ముఖ్యమయిన విషయం ఏమిటంటే, ఎదుటివారిని మెప్పించాలన్న ఉద్దేశంతో ఏ పని చేయ్యకండి …
ఏపని చేసినా కష్టపడి చెయ్యడం కాకుండా, ఇష్టపడి చెయ్యండి, అందులో ఉన్న ఆనందమేవేరు.
Posted by nani in 08:19:13
Comments

Leave a Reply