Sunday, 29 June 2008

ప్రాపకం

మనం ఎందుకో, ఎదుటివారి కనుసన్నల్లో మెలగాలని, వారిని ప్రసన్నం చేసుకోవాలని, ప్రసన్నతకలిగే పనులే చేయాలని, అలా చేయడంలోనే మన మనుగడ ఉంటుందని, పైవారి ఆశీస్సుల కోసం ప్రాకులాడతాము, ప్రాపకం కోసం అర్రులు చాస్తాం, అది కేవలం తాత్కాలికమని తెలిసినా కూడా ...
ఇదొక పెద్ద ఊబి లాంటిది, అన్ని రకాలయిన మత్తు పదార్దాలకు అతీతమయినది, దీనికి అలవాటు పడితే, అందులోంచి బయటకు రాలేనంత మాయా ప్రపంచం.
ప్రాపకం అనేది ఎంత దారుణమయినదంటే, అందులో ఇరుక్కుంటే, ఆఖరికి మన అస్థిత్వాన్ని కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడినా కూడా, అటువంటి సంధర్భాల్లో కూడా బయటకు రాలేకపోతాము, అభద్రతా భావానికి లోనవుతాము.
సాధారణంగా మనకి మనమీద కంటే ఎదుటివారిమీద నమ్మకం ఎక్కవ.
అందుకే ఇటువంటి పరిస్థితులనుండి మనల్ని మనం కాపాడుకోఅవాలి.
సకారాత్మకమయిన ఆలోచనా ధ్రుక్పధాన్ని అలవరుచుకుని, మన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, నిత్యనూతనంగా ఉండడం ద్వారా, మనమీద మనకు నమ్మకం ఏర్పడుతుంది, తద్వారా విజయం సాధించడానికి  కావలసిన పునాదులు ఏర్పడతాయి. అప్పుడు ప్రపంచం అంతా మీ వెంటే...
అన్నింటికంటే ముఖ్యమయిన విషయం ఏమిటంటే, ఎదుటివారిని మెప్పించాలన్న ఉద్దేశంతో ఏ పని చేయ్యకండి ...
ఏపని చేసినా కష్టపడి చెయ్యడం కాకుండా, ఇష్టపడి చెయ్యండి, అందులో ఉన్న ఆనందమేవేరు.
Posted by nani at 14:19:13 | Permanent Link | Comments (0) |

Friday, 06 June 2008

గుళ్ళు - గోపురాలు

పాపం పెరిగిపోతున్నాదని అందరు గాని భక్తి కూడా అంతకంతకూ పెరుగుతున్నాది.
పాపభీతి అనండి లేదా వేరే ఏమైనా కానియ్యండి, కారణాలు అప్రస్తుతం .......
ఇలా అనడానికి చాలా ఋజువులు ఉన్నాయి, సందేహం లేదు.
ఎందుకంటే అనేకమంది తమతమ ఇళ్ళముందు, ఆరుబయట తమకు నచ్చిన దైవాన్ని ప్రతిష్టించి, చిన్న గుడి కట్టించి, దూపదీపనైవేద్యాలతో కొలుస్తున్నారు, అందులో వీధి చివర్లోనో, రోడ్డు ప్రక్కగా ఇళ్ళు ఉన్నవారే అధికం .....
నా ఉద్దేశంలో భక్తిని గాని, భక్తులను శంకించడం కాదు, అది ప్రస్తావన కూడా కాదు...
భక్తిని/ మూఢ నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని ఈ విధంగా గుళ్ళు గోపురాలు తామరతంపరగా కట్టడాన్ని ప్రశ్నించాల్సిన విషయం/ సమయం.........
మన దేశంలో లెక్కలేనన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయి, బహుశా ప్రపంచలో మరెక్కడా ఉండవేమో? ఇంకా రోజురోజుకీ ఆలయాలు నిర్మించడానికి గల పరమార్దం ఒకటే.........
రహదారులు/ రోడ్లు జనసంచారానికి అనుకూలంగా వెడల్పుచెయ్యవలసి వచ్చినప్పుడు, ఈ ఆలయాల మూలంగా లేదా మూఢనమ్మకానికి లోబడి తమతమ స్థలాలకు ఎటువంటి నష్టం కలగకూడదన్న దూరదృష్టి తప్ప వేరే ఏమీలేదన్నది నా అభిప్రాయం, ఇప్పటికైనా ఇటువంటివాటిని అరికట్టాలి.
   
Posted by nani at 20:34:51 | Permanent Link | Comments (0) |

Tuesday, 03 June 2008

అభిమానం

అభిమానం, భక్తి, ఆరాధ్యభావన ఉండవలసిందే, ఎవరూ కాదనలేని విషయం. 
కానిఈ ఇదే కొన్ని సంధర్భాల్లో మితిమీరుతున్నట్ట్లుగా కనిపిస్తున్నాది.
ఈ మధ్య వచ్చిన వార్త ప్రకారం చాలా మంది మహనీయుల విగ్రహాలు నెలకొల్పడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా వ్యక్తుల సేవలు గుర్తించడానికి వేరే ఏమైనా చేస్తే బాగుంటుంది, కానీ ఈ విధంగా విగ్రహాలు నెలకొల్పుకుంటూ పోతే దానికి అంతే ఉండదు. రాజుల సొమ్ము రాళ్ళపాలు ఒకనాటి మాటయితే, ప్రజల సొమ్ము విగ్రహాలు/ సమాధుల పాలు నేటి విధానం లాగ ఉన్నది.
ఈ విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూపోతే, ఏ కూడలిలోనూ స్థలాలు మిగలవు, లేదా విగ్రహాలే మిగులుతాయి. పై స్థాయిలో ఉన్నవారు వారివారి నాయకుల/ బంధువుల విగ్రహాల ఏర్పాటు నిరంతరంగా సాగుతూనే ఉన్నాది. దేశాధినేతలు/ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతలు మొదలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు ఆఖరికి గల్లీ  నాయకుల విగ్రహాలు ఏఅర్పాటు చేసే ధోరణి ఎక్కువైపోతున్నాది. 
ఎవరో చేసారు, మనం ఎందుకు చెయ్యకూడదు అన్నదే తప్ప దీనివల్ల సాధించేది ఏముంటుంది, ఆఖరికి వాటిని శుభ్రం చేసే నాధుడుకూడా ఉండరు.
అభిమానం యొక్క విచిత్రపోకడల పరకాష్ట ఏమిటంటే, విగ్రహాలకు/ పోస్టర్లకు కూడా పాలభిషేకాలు/ తైలాభిషేకాలు చేస్తున్నారు.
దాహం వేసినవాడికి/ ప్రాణం ఉన్న మనిషికి గుక్కెడు మంచినీళ్ళు పోయడానికి కూడా సంకోచించే ఈ రోజుల్లో, ఇలా విగ్రహాలకు పాలాభిషేకం చెయ్యడం ఇదెక్కడి చోధ్యం ...
మనం ఎక్కడికి పోతున్నలో అర్దం కావట్లేదు.
Posted by nani at 15:00:50 | Permanent Link | Comments (0) |