Sunday, 04 May 2008

హాయిగా నవ్వండి మనసారా

గిరిగీసుకుని/ గడి కట్టుకుని, తమని తాము బంధించుకుని బతికేస్తుంటారు చాలా మంది. ప్రపంచభారాన్నంతా తామే మొస్తున్నంతగా కృంగిపోతారు,  గానుగకు కట్టిన ఎద్దు మాదిరి తమ చుట్టూ తాము తిరుగుతారు. ఎవరితోనైనా మాట్లాడితేఎమైపోతుందోనని, ఏం చెయ్యాల్సివస్తుందోనని భయమేమో.
జరిగినంత కాలం బాగానే ఉంటుంది, కాని సంఘం నుంచి, సమాజం నుంచి మనని మనం ఎంత కాలం దూరం చేసుకుంటాం, చివరకు గాని తెలియదు మనమేం   కోల్పోయామో.
జీవితాంతం మన విషయాలు ఎవరికీ తెలియకూడదని గుంభనగా, లౌక్యంగా ఉండాలనే తాపత్రయంలో, గుప్పెట బిగించి, గుండె తలుపులు మూసి, బావిలో కప్పలా తయారవుతాము.

అంతా మారాలనుకుంటాము, కేవలం మనం తప్ప.

గది తలుపులు, కిటికీలు మూసి ఉంచేస్తే, ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించక ఎలా గబ్బు కంపు కొడుతుందో, అలాగే మనం కూడా తయారవుతాం. వచ్చినప్పుడు ఏమి తెచ్చుకున్నాం, పోయేటప్పుడు ఏమి తీసుకుపోతాం, మధ్యలో ఎందుకంత అభధ్రతా భావం.

ఆఖరికి మనసారా నవ్వడానికి కూడా సంశయమే. ఆనందంగా ఉన్నామని ఎదుటివాడికి తెలిస్తే ఏదో అయిపోతుందన్నంతగా కుచించుకుపోయాము.

అనేక మానసిక/ శారీరక రుగ్మతలకు మూలం ఇదే.

అందరితో కలవండి, భావ సారూప్యత కలిగినవారితో మనసువిప్పి భావాలను పంచుకోండి. తరువాత కలిగిన మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు.

హాయిగా నవ్వండి మనసారా .........

నవ్వుల దినోత్సవం సంధర్బంగా ... అభినందనలతో ... శర్మ
Posted by nani at 14:03:06 | Permanent Link | Comments (0) |
Comments
Write a comment